: డీఎస్సీపై ఆందోళన వద్దు, త్వరలో నోటిఫికేషన్: గంటా
డీఎస్సీపై ఆందోళన అవసరం లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన రాష్ట్రస్థాయి విద్యాసదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రేషనలైజేషన్ లో భాగంగా ఒక్క ఉపాధ్యాయుడినీ తొలగించబోమని భరోసా ఇచ్చారు. విద్యారంగం అభివృద్ధి విషయంలో రాజీపడేది లేదని అన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తేవాల్సి ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. 'బడి పిలుస్తోంది' కార్యక్రమం ద్వారా 85 శాతం మంది పిల్లలు బడిపాట పట్టారని తెలిపారు.