: ఏఈఓ దేవేంద్రబాబుపై టీటీడీ నిషేధం
తిరుమలలో ఏఈఓ దేవేంద్రబాబుపై టీటీడీ నిషేధం విధించింది. కొంతకాలంగా, దళారీలకు సహకరిస్తున్నాడంటూ దేవేంద్రబాబుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిపై విచారణ జరిపిన టీటీడీ పాలకవర్గం, కొండపై ఐదేళ్ళపాటు విధులు నిర్వర్తించకుండా అతనిపై నిషేధం విధించింది.