: కేబీసీలో కోట్లు కొల్లగొట్టిన ఢిల్లీ బ్రదర్స్


దేశవ్యాప్తంగా విశేష ప్రజాదరణకు నోచుకున్న టీవీ షో 'కౌన్ బనేగా కరోడ్ పతి' (కేబీసీ). బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్టుగా వ్యవహరించే ఈ కార్యక్రమంలో ఢిల్లీకి చెందిన అచిన్ నరూలా, సార్థక్ నరూలా అనే సోదరులు రూ.7 కోట్లు గెలుచుకున్నారు. ప్రైజ్ మనీ గెలుచుకునే క్రమంలో వీరు, 4 లైఫ్ లైన్లనూ వినియోగించుకుని, మొత్తం 14 ప్రశ్నలకూ సరైన సమాధానాలు చెప్పారు. కాగా, ఈ షో చరిత్రలో ఈ స్థాయిలో ప్రైజ్ మనీ గెలవడం ఇదే ప్రథమం. ఆచిన్ ఢిల్లీలో మార్కెటింగ్ మేనేజర్ కాగా, సార్థక్ ఇంకా విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ సోదరుల అద్భుత ప్రదర్శనపై అమితాబ్ స్పందిస్తూ, "అద్భుతమైన క్షణాలివి. ఏం మేధస్సు!" అని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News