: సౌతిండియా షాపింగ్ మాల్ బ్రాండ్ అంబాసడర్ గా సమంత
దక్షిణాది నటి సమంత సౌతిండియా షాపింగ్ మాల్ కు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరించనున్నారు. సంస్థ యాజమాన్యం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సమంత నియామకం తమ వ్యాపార పురోగతికి ఎంతగానో తోడ్పడుతుందని భావిస్తున్నామని ఆ ప్రకటనలో తెలిపింది. 2011లో హైదరాబాదు కొత్తపేటలో ఈ సంస్థను ప్రారంభించగా, అనతికాలంలోనే వివిధ శాఖలుగా విస్తరించింది.