: హర్యానా అసెంబ్లీకి పోటీ పడుతున్న కేంద్ర మంత్రి సోదరి
అక్టోబర్ 15న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ సోదరి వదన శర్మ పోటీ పడనున్నారు. హర్యానాలోని 90 స్థానాల్లో జరగనున్న ఎన్నికల్లో 47 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. కొద్ది రోజుల క్రితం 43 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ తరపున అసెంబ్లీకి పోటీ పడనున్న 90 మంది అభ్యర్థుల ఎంపిక పూర్తైంది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన సమావేశమైన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ కమిటీలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.