: 2014 ఎన్నికల్లో కేంద్రంలో అధికారం ఎవరిది?: సివోటర్ సర్వే


వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలో ఎవరు అధికారంలోకి వస్తారన్న అంచనాలపై అప్పుడే దేశ ప్రజలలో ఎన్నో అంచనాలు, సందేహాలు నెలకొన్నాయి. ఈసారి కాంగ్రెస్ మట్టికరుస్తుందని, బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని భావిస్తున్నారు. కానీ కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ అత్తెసరు సీట్లే వస్తాయని తాజాగా సి వోటర్ సర్వేలో వెల్లడైంది.

సి వోటర్ పోల్ సర్వే జనవరి నుంచి మార్చి వరకూ దేశవ్యాప్తంగా జరిగింది. 38,332 మంది అభిప్రాయాల ఆధారంగా ఈ ఫలితాలను క్రోడీకరించారు. ఇందులో సర్వేయర్లు వెల్లడించిన అభిప్రాయాల ప్రకారం కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ వచ్చే సీట్లను కలిపినా కేంద్రంలో మెజారిటీ మార్క్ 272 దాటకపోవచ్చని తెలిసింది. ఈ రెండింటికీ 254 సీట్ల వరకూ వస్తాయని వెల్లడైంది. అందులో బీజేపీ సీట్లే 141 వరకూ ఉన్నాయి. ఎన్డిఎ మొత్తం మీద 184 సీట్లను సొంతం చేసుకుంటుందని, యుపిఎ 128 సీట్ల దగ్గరే ఆగిపోతుందని తేలింది.

ఇక ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుందని, థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వానికి అవకాశాలుంటాయని వెల్లడైంది. సమాజ్ వాదీ పార్టీ, వామపక్షాలు, బిజూ జనతాదళ్, టిడిపి, ఇతర పార్టీలతో థర్డ్ ఫ్రంట్ ఏర్పడవచ్చని సర్వే పేర్కొంది. బహుజన్ సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్, ఏఐఎడిఎంకె, వైఎస్సార్ కాంగ్రెస్ కు కలిపి 117 లోక్ సభ స్థానాలు వస్తాయని సర్వే వెల్లడించింది. అయితే ఎన్నికలకు ఇంకా ఏడాది కాలవ్యవధి ఉందని, ఆ లోపు ఫలితాలలో మార్పు రావచ్చని సర్వే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News