: బాలీవుడ్ హీరోలకు సవాలు విసిరిన హృతిక్ రోషన్
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్, ఉదయ్ చోప్రా, డినో మోరియా, డబూ రత్నానీలకు 'బ్యాంగ్ బ్యాంగ్' హీర్ హృతిక్ రోషన్ ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరాడు. విడుదలకు సిద్ధమవుతున్న 'బ్యాంగ్ బ్యాంగ్' ప్రమోషన్లో భాగంగా హృతిక్ రోషన్ ట్విట్టర్ సవాలు విసిరాడు. తాను విసురుతున్న ఫిట్ నెస్ ఛాలెంజ్ ను స్వీకరించేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారా? అని అడిగాడు. 'హ్యాపీ న్యూ ఇయర్' సినిమాలో 10 ప్యాక్ తో కనువిందు చేయనున్న షారూఖ్ కు తనను సవాల్ చేసే ధైర్యం ఉందా? అని పేర్కొన్నాడు. షారూఖ్ తాజా చిత్రంలోని 10 ప్యాక్ ఫోటోను పోస్ట్ చేసి 'నా సవాల్ ను స్వీకరిస్తారా?' అంటూ ట్వీట్ చేశాడు. ఈ సవాలుకు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉందని, తమకు ఏది గొప్ప ఫోటో అనేది తెలుసుకోవాలని ఉందని హృతిక్ పేర్కొన్నాడు. హృతిక్ ఫిట్ నెస్ ఛాలెంజ్ లో ఉదయ్ చోప్రా గెలుపొందాడు. అలాగే సోనమ్ కపూర్ కు కూడా 'బ్యాంగ్ బ్యాంగ్' చాలెంజ్ విసిరాడు. సోనమ్ నవ్వులు రెండు రోజులు తమకు ఇవ్వగలరా? అని అడిగాడు. స్మోకింగ్ అలవాటున్న అభిమానులను మూడు రోజుల పాటు పొగతాగే అలవాటు మానుకోగలరా? అంటూ సవాలు విసిరాడు. మొత్తానికి హృతిక్ తన తాజా చిత్రం 'బ్యాంగ్ బ్యాంగ్' ను ట్విట్టర్లో బాగానే ప్రమోట్ చేస్తున్నాడు.