: తెలంగాణలో 10.13 లక్షల రేషన్ కార్డులు రద్దు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోగస్ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు 10.13 లక్షల బోగస్ రేషన్ కార్డులను రద్దు చేసినట్టు పౌరసరఫరాల శాఖ తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 16,544 మెట్రిక్ టన్నుల బియ్యం, 2,460 కిలో లీటర్ల కిరోసిన్ సరఫరాను నిలిపివేసినట్టు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది.