: తెలంగాణ ప్రభుత్వానికి 'మహిళల భద్రత-రక్షణ' కమిటీ సూచనలు ఇవే


తెలంగాణ ప్రభుత్వం నియమించిన మహిళా భద్రత-రక్షణ అంశంపై సీనియర్ ఐఏఎస్ అధికారిణి పూనం మాలకొండయ్య నేతృత్వంలోని కమిటీ సీఎం కేసీఆర్ కు నివేదిక సమర్పించింది. మహిళల రక్షణకు కమిటీ కొన్ని సూచనలు చేసింది. వాటి వివరాలివే... జిల్లాల్లో మహిళల భద్రత సమస్యల పరిష్కారానికి కేంద్రాలు ఏర్పాటు చేయాలని కమిటీ స్పష్టం చేసింది. పరిష్కార కేంద్రాల్లో సభ్యులుగా కౌన్సిలర్, మహిళా న్యాయవాది, పోలీసు ఉన్నతాధికారి, వైద్యులు, మహిళా సంక్షేమ అధికారిని నియమించి మహిళల సమస్యలు పరిష్కరించాలని సూచించింది. మూడు అంకెల హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలని కమిటీ తెలిపింది. హైదరాబాదులో మహిళల భద్రత కోసం మూడు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని కమిటీ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. ఫిర్యాదులపై 90 రోజుల్లోనే అభియోగపత్రం న్యాయస్థానానికి సమర్పించాలని కమిటీ పేర్కొంది. మహిళలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక గది ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. వీటికి అదనంగా మరిన్ని సూచనలు చేసింది.

  • Loading...

More Telugu News