: జన్మభూమికి కాంగ్రెస్ కార్యకర్తలంతా హాజరు కావాలి: రఘువీరా


అక్టోబర్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న జన్మభూమి కార్యక్రమానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త హాజరుకావాలని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జన్మభూమి కార్యక్రమంలో ప్రజల తరపున ప్రభుత్వాన్ని హామీలపై నిలదీయాలని కోరారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ మోసపూరిత హామీలు ఇచ్చిందని ఆయన మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News