: అస్సాంలోకి ప్రవేశించేందుకు అల్ ఖైదా యత్నం: తరుణ్ గొగోయ్


ఈశాన్య రాష్ట్రం అస్సాంలోకి చొరబడేందుకు అల్ ఖైదా ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమత్రి తరుణ్ గొగోయ్ చెప్పారు. అంతేగాక ఆ టెర్రర్ గ్రూపు రాష్ట్రంలో స్థావరం ఏర్పాటు చేసుకునేందుకు, ఉల్ఫా (యూఎల్ఎఫ్ఏ)తో రహస్య ఒప్పందం కూడా చేసుకుందని మీడియా ముఖంగా ప్రకటించారు. ఈ మేరకు తమకు సమాచారం ఉందని, ఈ క్రమంలో వారి చొరబాటును నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, సంబంధిత జాగ్రత్తలన్నీ తీసుకుంటామని చెప్పారు. ఇటీవల భారత్ లో అల్ ఖైదా తన శాఖను ప్రారంభించడం, అటు భారత్ లో ఆ సంస్థ విఫలమవుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం.

  • Loading...

More Telugu News