: మెట్రో రైల్వేపై ప్రజలకు అనుమానాలున్నాయి: జానారెడ్డి
ప్రతిష్ఠాత్మక మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రజల్లో పలు అనుమానాలున్నాయని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మెట్రో ప్రాజెక్టుపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలు నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాల్లో పారదర్శకత లోపించిందన్న ఆరోపణలకు ఆస్కారం ఇవ్వరాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎల్ అండ్ టీకి కేటాయించిన భూమి వారి వద్దే ఉందని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోతోందని ఆయన ప్రశ్నించారు.