: స్వర్ణం సాధించిన జీతూరాయ్ కు 50 లక్షల నజరానా
దక్షిణ కొరియాలోని ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ కు తొలి స్వర్ణం సాధించి పెట్టిన లక్నోకు చెందిన జీతూరాయ్ కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల నగదు బహుమానం ప్రకటించింది. ఈ మేరకు యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ అతనిని అభినందించారు. "జీతు అంకితభావం, కృషి, ప్రతిభతో స్వర్ణ పతకం సాధించాడు. దాంతో దేశానికి ఎంతో కీర్తిని సంపాదించాడు" అని ఓ ప్రకటనలో అఖిలేశ్ పేర్కొన్నారు. అంతేగాక జీతూ సాధించిన రికార్డు దేశంలోని యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని, లక్ష్యాలను సాధించాల్సిన వారిని ప్రభావితం చేస్తుందనీ అన్నారు. త్వరలో నగదు బహుమానాన్ని జీతూకు అందించనున్నారు.