: విమానాల్లో ఢిల్లీకి చక్కర్లు కొట్టడం మినహా చంద్రబాబు ఏమీ చేయడం లేదు: చిరంజీవి


కాంగ్రెస్ నాయకుడు చిరంజీవి చాలా కాలం తర్వాత అధికార, ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానాల్లో చక్కర్లు కొట్టడం మినహా... ఏ పనీ చేయడం లేదని ఆయన విమర్శించారు. రుణమాఫీపై రోజుకో మాట చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ సర్కార్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ అధ్వానంగా ఉందన్నారు. వందరోజుల పండుగ సినిమాల్లో చేసుకుంటారని... ఐదేళ్ల పాటు పాలించాల్సిన ప్రభుత్వాలు వంద రోజుల పాలనకే సెలబ్రేట్ చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా సమర్థవంతంగా పనిచేయలేకపోతోందని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News