: ఈ నెల 24న అరుణ గ్రహాన్ని చేరుకుంటున్న 'మామ్'


భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ప్రతిష్ఠాత్మక మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) మరో నాలుగు రోజుల్లో అరుణ గ్రహాన్ని చేరుకోబోతుంది. ఈ నేపథ్యంలో 'మంగళయాన్' ప్రవేశానికి గుర్తుగా కేరళ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు రాజ్యసభ టీవీ, విజ్ఞాన్ ప్రసార్, సీఎస్ఐఆర్ భాగస్వామ్యంతో ఈ నెల 23, 24న కార్యక్రమాలు చేపట్టాలని ప్రణాళిక వేసినట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. 'హ్యూమన్ స్పేస్ ఎక్స్ ప్లొరేషన్' పేరుతో 23న ఓ సెమినార్ నిర్వహించనుంది. ఇస్రో మాజీ డిప్యూటీ డైరెక్టర్ పి.రాధాకృష్ణన్ ఈ సెషన్ కు బాధ్యత వహిస్తారని తెలిపింది. అంతేగాక స్పేస్ ఎక్స్ ప్లొరేషన్ పై కళాశాల విద్యార్థులతో క్విజ్ కాంపిటిషన్ కూడా ఏర్పాటు చేయనున్నారు.

  • Loading...

More Telugu News