: బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్ లో మహిళలు క్వార్టర్స్ కు... పురుషులు ఇంటికి
ఆసియా క్రీడల్లో మహిళల బ్యాడ్మింటన్ ఈవెంట్ లో భారత్ క్వార్టర్స్ కు చేరుకుంది. ప్రీీ క్వార్టర్ ఫైనల్లో మకావూను 3-0 తేడాతో భారత్ ఓడించింది. సైనా నెహ్వాల్, పీవీ సింధులు తమ ప్రత్యర్థులపై సునాయాస విజయాల్ని నమోదు చేసుకున్నారు. ఇక పురుషుల బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్ లో, భారత్ కొరియా చేతిలో 0-3 తో ఘోర పరాజయం పాలయ్యింది. సింగిల్స్ లో పారుపల్లి కశ్యప్, శ్రీకాంత్ లు ఓటమి పాలయ్యారు. డబుల్స్ లో సుమిత్ రెడ్డి- మనుఆత్రీల జోడి కూడా ఓటమి చవిచూసింది.