: బిల్ గేట్స్ తరగని సంపదకు కారణం... మైఖేల్ లార్సన్ ప్రణాళికలే!


బిల్ గేట్స్... ప్రపంచ కుబేరుల జాబితాలో ప్రథమ స్థానం ఆయనది. ఏడాది కాదు, రెండేళ్లు కాదు. వరుసగా ఏళ్లుగా ఆయనదే, ఆ జాబితాలో అగ్రస్థానం. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 81.6 బిలియన్ డాలర్లు. కేవలం మైక్రోసాఫ్ట్ తోనే ఆయన ఆ మేర సంపాదించారనుకుంటే, మరి కంపెనీ పగ్గాలను చాలా కాలం కిందటే వదిలేసినా, ఆయన ఆస్తులు తరగడం లేదెందుకని? తరగవు కూడా... ఎందుకంటే, ఆయన వెనుక మైఖేల్ లార్సన్ ఉన్నారు! ఆర్థిక వ్యవహారాల్లో ఆరితేరిన లార్సన్, బిల్ గేట్స్ సంపదను ఏటికేడు పెరిగేలా చేస్తున్నారు. బిల్ గేట్స్ పెట్టుబడులు, ఆర్థిక వ్యవహారాల కోసం కాస్కేడ్ ఇన్వెస్ట్ మెంట్స్ ఎల్ఎల్సీ పేరిట ఓ కంపెనీ ఉన్న సంగతి తెలిసిందే. దీని బాధ్యతలను లార్సన్ పర్యవేక్షిస్తున్నారు. లార్సన్, తన వద్ద పనికి కుదిరే నాటికి బిల్ గేట్స్ ఆస్తుల విలువ కేవలం 5 బిలియన్ డాలర్లు మాత్రమే. ఆ డబ్బును ఏం చేయాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఏఏ సంస్థల్లో ఎంత పెట్టాలి? అన్న నిర్ణయాలన్నీ లార్సన్ వే. ఇందులో బిల్ గేట్స్ దంపతుల పాత్రేమీ ఉండదట. బిల్ గేట్స్ డబ్బును కంటికి రెప్పలా కాపాడుతున్న లార్సన్ ను అందరూ ‘ద గేట్స్ కీపర్’ అని పిలుస్తారు. లార్సన్ లోని ఆర్థిక నైపుణ్యతను తెలుసుకున్న బిల్ గేట్స్ తన వద్ద పనిచేయమంటూ స్వయంగా కోరారట. 20 ఏళ్లుగా బిల్ గే్ట్స్ వద్ద పనిచేస్తున్న లార్సన్, ఆ సంపదను ఇంకెతం పెంచుతారో చూడాలి.

  • Loading...

More Telugu News