: విజయవాడలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
విజయవాడలోని గేట్ వే హోటల్ లో ఏపీ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మొదలైంది. ఈ సమావేశానికి టీడీపీ, బీజేపీ ఎంపీలు, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎస్పీవై రెడ్డి, అరకు ఎంపీ కొత్తపల్లి గీత హాజరయ్యారు. కొత్త రాజధాని, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావల్సిన నిధులు, సాధించుకోవాల్సిన అంశాలపై చర్చిస్తున్నారు. కాగా, ఈ మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు పార్టీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం కూడా జరుగుతుంది.