: తీహార్ జైలు... 17 రోజుల్లో ఐదుగురు ఖైదీల మృతి
తీహార్ జైలు ఆసియాలోనే అతిపెద్ద జైలు. కట్టుదిట్టమైన భద్రతకు పెట్టింది పేరు. బడా నేరస్తుల నుంచి పిక్ పాకెట్స్ దాకా ఇందులో జైలు పక్షులుగా కొనసాగుతూ ఉంటారు. ఈ జైలు బాధ్యతలను మోయడమంటే ఏ స్థాయి పోలీసు బాసుకైనా సవాల్ తో కూడుకున్నదే. కిరణ్ బేడీ లాంటి సమర్థవంతమైన అధికారుల నేతృత్వంలో పలు సంస్కరణలు కూడా ఇందులో అమలయ్యాయి. అదంతా గతం. ప్రస్తుతం జైల్లో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. ఈ నెల 2 నుంచి గురువారం దాకా కేవలం 17 రోజుల వ్యవధిలో ఐదుగురు ఖైదీలు మృత్యువాత పడ్డారు. అది కూడా ఏ అనారోగ్యం కారణంగానో అయితే, అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఐదుగురూ అనుమానాస్పద స్థితిలోనే మరణించారు. తోటి ఖైదీల చేతిలో దాడికి గురై మరణించిన ఓ ఖైదీ ఉదంతం కూడా ఈ ఐదింటిలో ఒకటి. దీంతో ఢిల్లీ హైకోర్టు, తీహార్ జైలు పరిస్థితులపై దృష్టి సారించింది. జైలులో చోటుచేసుకున్న మరణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు జోక్యంతోనైనా తీహార్ జైలు పరిస్థితుల్లో మార్పొస్తుందని ఆశిద్దాం.