: 'చోటా' ఠాక్రే చివరి యత్నం ఫలించినట్టే ఉంది!


బీజేపీ, శివసేన 25 ఏళ్లుగా మిత్ర పక్షాలుగా కొనసాగుతున్నాయి. అయితే, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 25 రోజుల సమయముందనగా రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై అభిప్రాయభేదాలు పొడచూపాయి. ఇక సుదీర్ఘ స్నేహానికి ఇరు పార్టీలు తిలోదకాలివ్వడం తథ్యమేనన్న పుకార్లు శుక్రవారం సాయంత్రం దాకా షికార్లు చేశాయి. అప్పుడే చోటా ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే సుపుత్రుడు ఆదిత్య ఠాక్రే రంగంలోకి దిగారు. నేరుగా బీజేపీ సీనియర్ నేత ఓపీ మాధూర్ తో భేటీ అయ్యారు. భేటీ తర్వాత మీడియా ముందుకొచ్చిన ఆదిత్య ఠాక్రే, ‘‘రెండు పార్టీలు సంకీర్ణాన్ని కొనసాగించేందుకు యత్నిస్తున్నాయి. ఇందుకోసం పలు ఫార్ములాలను పరిశీలిస్తున్నాం’’ అంటూ ప్రకటించారు. అంతే, ఆ పార్టీల సుదీర్ఘ స్నేహానికి అప్పుడే ఫుల్ స్టాప్ పడలేదన్న భావన కలిగింది. ఉప ఎన్నికల్లో బీజేపీ చవిచూసిన అనుభవాన్ని దెప్పి పొడుస్తూ శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ప్రధాని నరేంద్ర మోడీపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఇరు పార్టీల మధ్య పెద్ద అగాధాన్నే సృష్టించాయి. అయితే తన తండ్రి కారణంగా ఏర్పడ్డ నష్టాన్ని నివారిచేందుకు ఆదిత్య ఠాక్రే చేసిన యత్నాలు దాదాపుగా ఫలించేటట్లుగానే కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News