: వైట్ హౌస్ కూ తప్పని చొరబాట్లు!


నిజమే... ఇటీవలి కాలంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు చొరబాట్ల తాకిడి ఎక్కువైంది. నిన్నటికి నిన్న సెప్టెంబర్ దాడుల సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమం జరుగుతుండగా, ఓ అగంతుకుడు వైట్ హౌస్ లోకి చొరబడేందుకు యత్నించాడు. ఆ ఘటనను మరువకముందే, శుక్రవారం సాయంత్రం ఈ తరహాలోనే మరో ఘటన చోటుచేసుకుంది. ప్రహరీని దూకేసిన ఓ వ్యక్తి నేరుగా వైట్ హౌస్ లో్కి చొచ్చుకెళ్లాడు. దీంతో భవనంలోని ఎగ్జిక్యూటివ్ మాన్షన్ ను ఖాళీ చేయించిన భద్రతాధికారులు అగంతుకుడి కోసం తీవ్రంగా గాలించారు. అయితే వారి కంటికి అతడు కనిపించకుండానే ఉడాయించినట్లు సమాచారం. అగంతుకుడు వైట్ హౌస్ లోకి దూకడానికి కొద్దిసేపటి ముందే అధ్యక్షుడు బరాక్ ఒబామా తన కూతుర్లతో కలిసి ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News