: ఏటీఎం మిషన్ ఓపెన్ అయిపోయింది!


ఏటీఎం మిషన్ నుంచి డబ్బు వస్తే ఫరవాలేదు కాని, ఏకంగా మిషనే ఓపెన్ అయిపోతే, పరిస్థితి ఏమిటీ? మిషన్ లో బ్యాంకు సిబ్బంది పెట్టిన మొత్తం డబ్బు బయటికి వచ్చేసినట్లే. ఇలాంటి ఘటనే శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ లోని ఎస్ బీహెచ్ ఏటీఎంలో చోటుచేసుకుంది. ఓ కస్టమర్, తన ఖాతాలోని డబ్బు డ్రా చేసుకునేందుకు ఏటీఎంలోకి వెళ్లాడు. అయితే అప్పటికే ఏటీఎం మిషన్ పూర్తిగా ఓపెన్ అయిపోయి ఉండటాన్ని గుర్తించాడు. అంతే, ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన అతడు, ఒక్క క్షణం ఆలోచించాడు. తనది కాని డబ్బు తనకు అవసరం లేదంటూ నేరుగా పోలీసులకు సమాచారం అందించాడు. కంగారుపడ్డ పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకుని మిషన్ లోని డబ్బును బ్యాంకుకు అప్పజెప్పారు. అయితే, సాంకేతిక సమస్య తలెత్తిన కారణంగానే ఏటీఎం మిషన్ తెరుచుకుందని ఆ తర్వాత నిపుణులు నిర్ధారించారు.

  • Loading...

More Telugu News