: చిన్న పంటి నొప్పి దేహం మొత్తాన్ని బాధిస్తుంది!: చైనా అధ్యక్షుడితో మోడీ


‘‘పంటి నొప్పి చిన్నదే అయినా మొత్తం దేహాన్నే బాధిస్తుంది. చిన్న ఘటనలే అయినా అవి దేశాల మధ్య సంబంధాలనే ప్రభావితం చేస్తాయి’’ ఇదీ ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కు చెప్పిన మాట. ఆ మాట కూడా చిన్నదే అయినా, చైనానే కదిలేలా చేసింది. చొరబాట్ల వైపు దూసుకొస్తున్న ఆ దేశ సైనికులను వెనుదిరిగేలా చేసింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత పర్యటనకు బయలుదేరడానికి కొంత ముందుగా లఢక్ లోని భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చిన చైనా సైనికులు అక్కడే తిష్ట వేశారు. ఏకంగా శాశ్వత నిర్మాణాలను చేపట్టి, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యారు. భారత్ లో అడుగుపెట్టిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ఏమీ ఎరుగనట్లే వ్యవహరించారు. అయితే శుక్రవారం జరిగిన భేటీ సందర్భంగా మోడీ చేసిన మ్యాజిక్ బాగానే పనిచేసింది. అప్పటిదాకా ఇరు దేశాల మధ్య ఉన్న పలు సమస్యలతో పాటు కొన్ని కొత్త తరహా ఒప్పందాలపైనే చర్చలు జరిపిన ఇరు దేశాధినేతల మధ్య తుది దశ చర్చలు కూడా ఆ క్రమంలోనే సాగుతాయనుకుంటున్న తరుణంలో మోడీ ఒక్కసారిగా తన బలమైన వాదనను అతి సున్నితంగానే ప్రయోగించారు. దెబ్బకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు పరిస్థితి అర్థమైంది. తన సైన్యానికి ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది. బహిరంగ సభలో జనాకర్షక వ్యాఖ్యతో ప్రజలను ఇట్టే సమ్మోహితులను చేయడమే కాదు, దేశాధినేతలను కూడా ఆకట్టుకోగలను అంటూ మోడీ, తన తాజా మాటలమంత్రంతో నిరూపించారు.

  • Loading...

More Telugu News