: జమ్మూకాశ్మీర్ వరదల్లో 277 మంది మరణించారు: సీఎం ఒమర్ అబ్దుల్లా


గత ముప్పై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా జమ్మూకాశ్మీర్ ను ముంచెత్తిన భారీ వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 277 మంది మృతి చెందారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. అయితే, తొలుత భయపడినట్టుగా, మరణాల సంఖ్య పెరగలేదన్నారు. ఈ మేరకు పీటీఐతో ఆయన మాట్లాడుతూ, "వరదల సమయంలో రాజౌరీ జిల్లాలో ఓ పెళ్లి బస్సు కొట్టుకుపోయి 44 మంది చనిపోయారు. వారితో పాటు ఒక్క జమ్మూలోనే 203 మంది మరణించారు" అని చెప్పారు. సహాయక చర్యల్లో భాగంగా 74 మృతదేహాలను కాశ్మీర్ వ్యాలీలోని పలు ప్రాంతాల్లో బయటకు తీసినట్లు ఒమర్ వివరించారు. కాగా, కొన్ని మృతదేహాలను జంతువులు తింటున్నాయని, మరికొన్ని దేహాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు కొట్టుకుపోయాయన్న వార్తలను ఆయన తిరస్కరించారు.

  • Loading...

More Telugu News