: 'బ్యాడ్మింటన్' ఆశలన్నీ ఆ ముగ్గురిపైనే!
దక్షిణకొరియాలోని ఇంచియాన్ వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో భాగంగా తొలుత బ్యాడ్మింటన్ టీం విభాగం పోటీలు నిర్వహించనున్నారు. భారత్ భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది. ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్, ఆశాకిరణం పీవీ సింధు, పురుషుల విభాగం స్టార్ షట్లర్ పారుపల్లి కాశ్యప్ అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తే, పతకాలు సాధించడం పెద్ద కష్టం కాబోదని భారత శిబిరం భావిస్తోంది. అయితే, చైనా క్రీడాకారుల నుంచి ఎదురయ్యే పోటీ రీత్యా హోరాహోరీ పోరు తప్పదనిపిస్తోంది. 1986లో చివరిసారిగా భారత పురుషుల జట్టు కాంస్యం గెలిచింది. ఆ తర్వాత టీం ఈవెంట్ లో ఎప్పుడూ పతకం లభించలేదు.