: ఇంతకీ వర్మ 'ఆగడు' హిట్టన్నట్టా? ఫట్టన్నట్టా?
సంచలన వ్యాఖ్యలతో తన క్రేజ్ తగ్గకుండా చూసుకునే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ 'ఆగడు' సినిమాపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. 'ఆగడు' సినిమాకు 'మగధీర' సినిమాకు పోలిక పెట్టారు. 'ఆగడు' రూ.75 కోట్ల సినిమా అయితే, 'మగధీర' రూ.750 కోట్ల సినిమా అని వర్మ ట్వీట్ చేశారు. ఈ రెండు సినిమాలు ఆయా హీరోల కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రాలని, అందుకే వాటి మధ్య పోలిక తెచ్చానని వర్మ తెలిపారు. కాగా, భారీ అంచనాల నడుమ విడుదలైన 'ఆగడు' సినిమాకు డివైడ్ టాక్ వస్తోంది.