: మాండోలిన్ కు శ్రీనివాస్ ఖ్యాతి తెచ్చాడు: జయలలిత


విఖ్యాత సంగీత విద్వాంసుడు మాండోలిన్ శ్రీనివాస్ మృతి పట్ల తమిళనాడు సీఎం జయలలిత సంతాపం ప్రకటించారు. మాండోలిన్ వాయిద్యానికి ఖ్యాతి తెచ్చిన వ్యక్తి శ్రీనివాస్ అని ఆమె కీర్తించారు. శ్రీనివాస్ మరణ వార్త విన్న వెంటనే దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు. సంగీత కళాకారుల కుటుంబంలో పుట్టిన శ్రీనివాస్ సంగీత ప్రేమికుల హృదయాలను గెలుచుకున్నారని జయ పేర్కొన్నారు. కాగా, తమిళనాడు గవర్నర్ రోశయ్య కూడా మాండోలిన్ శ్రీనివాస్ మృతికి సంతాపం తెలియజేశారు.

  • Loading...

More Telugu News