: తేడా వస్తే అపర 'కాళి'కావతారమే!


ఢిల్లీ మెట్రో రైళ్ళలో మహిళలపై వేధింపులు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) 'ఆపరేషన్ కాళి' పేరిట కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. మెట్రో రైళ్ళలో మహిళలను వేధించే కామాంధుల పనిబట్టడమే ఈ ఆపరేషన్ ముఖ్యోద్దేశం. అందుకుగాను, సీఐఎస్ఎఫ్ మెరికల్లాంటి మహిళా కమాండోలను రంగంలోకి దించింది. వీరు ఫిిలిప్పీన్స్ పురాతన యుద్ధ విద్య పెకిటి-తిరిసా కాలి (పీటీకే)లో శిక్షణ పొందారు. మహిళల వద్ద వుండే మామూలు వస్తువులతోనే, ఒకరి కన్నా ఎక్కువ మంది శత్రువులను ఈ యుద్ధవిద్య ద్వారా ఎదుర్కొనవచ్చు. ఈ సీఐఎస్ఎఫ్ కమాండోలు పెన్నులు, హెయిర్ పిన్నులు, టోపీలు, బెల్టులు, షూ లేసులు, చివరికి తాళాలను కూడా ప్రాణాంతక ఆయుధాలుగా మలిచి, దుష్ట శక్తుల ఆట కట్టించగలరు. దీనిపై సీఐఎస్ఎఫ్ చీఫ్ అరవింద్ రంజన్ మాట్లాడుతూ, మెట్రో రవాణా వ్యవస్థలో మహిళలు సురక్షితంగా ప్రయాణించాలని కోరుకుంటున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News