: మాండోలిన్ శ్రీనివాస్ మృతికి ప్రధాని, బాబు సంతాపం
మాండోలిన్ శ్రీనివాస్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యులకు మోడీ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రధాని ఈ మేరకు ట్వీట్ చేశారు. సంగీత రంగానికి శ్రీనివాస్ ఎనలేని సేవలందించారని కీర్తించారు. అటు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మాండోలిన్ శ్రీనివాస్ మృతికి సంతాపం తెలిపారు. చిన్న వయసులోనే కన్నుమూయడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. తెలుగువాడైన శ్రీనివాస్ కాలేయ సమస్యతో ఈ ఉదయం చెన్నైలో మరణించారు.