: బెదిరింపు ఎత్తుగడలు పని చేయవు... అజిత్ సింగ్ కు వెంకయ్య పరోక్ష హెచ్చరిక


కేంద్ర ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్న కేంద్ర మాజీ మంత్రి, ఆర్ ఎల్డీ నేత అజిత్ సింగ్ వ్యవహారంపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన వెంకయ్య, ఎలాంటి బెదిరింపు ఎత్తుగడలు పని చేయవని అజిత్ సింగ్ పేరు ప్రస్తావించకుండా అన్నారు. అయితే, ఈ విషయంలో ఆయనపై ఎలాంటి రాజకీయ ప్రతీకారం తీర్చుకునే ప్రశ్నే లేదన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో అజిత్ ఉంటున్న ఇంటిని చౌదరి చరణ్ సింగ్ స్మారక కేంద్రంగా ప్రకటించాలని ఆర్ ఎల్డీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. కాగా, ఇదే విషయంలో మంత్రి ఇంటికి నీరు, విద్యుత్ సరఫరాను కొన్ని రోజుల కిందట అధికారులు బంద్ చేశారు. దాంతో, ఆయన అనుచరులు నిరసన కూడా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News