: ఒరాకిల్ సీఈవో పదవి నుంచి తప్పుకున్న ఎల్లిసన్
ప్రముఖ ఐటీ సంస్థ ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో లారీ ఎల్లిసన్ పదవి నుంచి వైదొలిగారు. ముప్పై ఏడేళ్ళపాటు సంస్థను నడిపించిన ఆయన తాజాగా రాజీనామా చేయడం గమనార్హం. ఈ నిర్ణయంతో స్టాక్ మార్కెట్లలో ఒరాకిల్ షేర్లు 2 శాతం పడిపోయాయి. ఈ నేపథ్యంలో, కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా ఉన్న సఫ్రా కాట్జ్, మార్క్ హర్డ్ లు ఈ బాధ్యతలు పంచుకోనున్నారు. కాగా, సీఈవో పదవి నుంచి ఎల్లిసన్ వైదొలిగినప్పటికీ సంస్ధ ఇంజనీరింగ్ బృందానికి ఆయనే సారథిగా వ్యవహరిస్తారు.