: ఎంజీఆర్ నుంచి స్పీల్ బర్గ్ వరకు అందరూ మాండలిన్ శ్రీనివాస్ అభిమానులే!


ఈ ఉదయం మరణించిన మాండలిన్ శ్రీనివాస్ ప్రతిభా పాటవాలు అనన్య సామాన్యం. జనబాహుళ్యంలో అంతగా పేరులేని మాండలిన్ వాయిద్యానికి అతను విశేష ఖ్యాతిని తెచ్చిపెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి లెజెండ్స్ వరకు ఆయనకు ఎంతోమంది అభిమానులున్నారు. ''మాండలిన్ శ్రీనివాస్ ను చూస్తే నాకు కన్నుకుడుతోంది. అతని ప్రతిభను చూస్తే చంపేయాలనుంది'' అని విపరీతమైన అభిమానం ఫ్రకటించాడు విశ్వవిఖ్యాత బ్రిటీష్‌ సంగీతకారుడు స్టింగ్‌. హాలీవుడ్ దర్శక దిగ్గజం స్టీవెన్‌ స్పీల్‌ బర్గ్‌ అమెరికాలో ఓ కచేరీ తర్వాత... శ్రీనివాస్ ఆటోగ్రాఫ్‌ కోసం, చుట్టూ ఉన్న జనాన్ని తోసుకుంటూ వెళ్లి... మాండలిన్ శ్రీనివాస్ ముందు 'పిల్లవాడిలా' మారిపోయాడు. 80వ దశకంలో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్‌ దూరదర్శన్‌లో నూనుగు మీసాల మాండలిన్ శ్రీనివాస్ కచేరీ చూసి, వెంటనే శ్రీనివాస్‌తో మాట్లాడాలని విపరీతమైన ఆరాటం ప్రదర్శించారట. తన సెక్రటరీని ఫోన్‌ చేసి శ్రీనివాస్ నెంబర్ కు వెంటనే కలపమన్నారు. ఆ రోజుల్లో, శ్రీనివాస్‌కి సొంత ఫోన్‌ అంటూ ఏదీ లేదు. ఈ విషయం తెలుసుకుని, ఎంజీఆర్‌ తన పర్సనల్‌ సెక్రటరీని శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లి, ఎలాగైనా అతన్ని తన నివాసానికి తీసుకురమ్మని చిన్నపిల్లాడిలా బతిమాలాడారట. కానీ, ఆ రోజు ఓ కచేరీ ఉండడంతో సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఇంటికి రావడానికి మాండలిన్ శ్రీనివాస్ నిరాకరించాడు. దీంతో, ఎంజీర్ తన ప్రభుత్వ కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకుని... శ్రీనివాస్ కచేరీ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. ఇలాంటి సంఘటనలు మాండలిన్ శ్రీనివాస్ జీవితంలో కోకొల్లలు... మాండలిన్ శ్రీనివాస్ మరణం భారతీయ కళారంగానికి నిజంగా తీరని లోటు!

  • Loading...

More Telugu News