: హిట్లర్...మాంసాన్నే ముట్టేవాడు కాదట!


రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడిగా నిలిచిన అడాల్ఫ్ హిట్లర్, మాంసాహారాన్నే ముట్టేవాడు కాదట. నిత్యం శాకాహారం తీసుకునే ఆయన, భోజనం చేసే ప్రతి సందర్భంలోనూ భయంభయంగానే గడిపేవాడట. ఎందుకంటే, బ్రిటన్ తనపై ఎప్పుడు విష ప్రయోగం చేస్తుందోనన్న అనుమానం ఆయనను నిత్యం వేధించేదట. దీంతో, తాను తీసుకునే ఆహారాన్ని గంట ముందుగా ఇతరులతో తినిపించి మరీ భోజనం ప్రారంభించేవాడట. ఇలా ఆయన ఆహారాన్ని పరీక్షించే బృందంలోని మహిళ మార్గట్ వోల్క్ ఈ విషయాను తాజాగా వెల్లడించారు. 95 ఏళ్ల వయసున్న వోల్క్, నాటి హిట్లర్ ఆహారాన్ని పరీక్షించిన బృందంలో నేటికీ బతికి ఉన్న ఒకే ఒక వ్యక్తి. మిగిలిన సభ్యులందరూ ఎప్పుడో మరణించారు. నాటి భయానక అనుభవాలను నెమరువేసుకున్న వోల్క్, హిట్లర్ ఆహారాన్ని పరీక్షించాల్సి వచ్చినప్పుడల్లా, తామెక్కడ చనిపోతామోనని హడలిపోయేవారమని తెలిపారు. హిట్లర్ తీసుకోబోయే ఆహారాన్ని ఈ బృందం సభ్యులకిచ్చి గంట పాటు పరిశీలించేవారట. వీరికేమీ కాలేదని రూఢీ చేసుకున్నాకే, హిట్లర్ నోట్లో ముద్ద పెట్టుకునేవారు. ఈ నేపథ్యంలో హిట్లర్, ఎప్పుడూ మాంసాహారాన్ని తీసుకోలేదని వోల్క్ చెప్పారు. అన్నం, నూడుల్స్, పెప్పర్లు, గింజలు, కాలిఫ్లవర్ తదితరాలతో కూడిన ఆహారాన్నే హిట్లర్ తీసుకునేవారని బెర్లిన్ టీవీ షోలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News