: దొంగను ఛేజ్ చేయబోతుండగా మహిళకు డెలివరీ...అమెరికాలో సంచలన సంఘటన
అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో సినీ ఫక్కీలో జరిగిన ఓ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కొన్ని రోజుల క్రితం, మిచిగాన్ రాష్ట్రంలోని ఫ్లింట్ సిటీలో నిండు గర్భిణీ అయిన ఓ మహిళ సూపర్ మార్కెట్లో సరుకులు కొన్నుక్కుని... కార్లో వాటిని పెడుతుండగా... ఓ అగంతుకుడు ఆమె భుజానిికి తగిలించుకున్న పర్స్ ను కాజేసి ఉడాయించబోయాడు. వెంటనే తేరుకున్న ఆమె అతన్ని పట్టుకోబోయింది. దీంతో దొంగ ఆమెను తోసేసి పరుగందుకున్నాడు. ఈ హఠాత్ పరిణామంతో, ఆమె గట్టిగా గావు కేకలు వేయడం ప్రారంభించింది. అదే సమయంలో, ఆమెకు నొప్పులు రావడం... డెలివరీ అవడం నిమిషాల్లో జరిగిపోయాయి. మహిళ అరుపులు విన్న స్థానికులు దొంగను పట్టుకున్నారు. నార్మల్ డెలివరీ అవడంతో పాటు... సిజేరియన్ చేయించుకునే కష్టం తప్పడంతో ఆమె ప్రస్తుతం చాలా ఆనందంగా ఉంది. దీంతో పాటు, చేజారిపోయిందనుకున్న పర్స్ మళ్లీ చేతికి అందడంతో ఆమె ఆనందం రెట్టింపు అయ్యింది. దొంగను స్థానికులు పోలీసులకి అప్పజెప్పారు. అతనిని 'మార్క్ న్యూటన్' గా పోలీసులు గుర్తించారు.