: ప్రైవేటు మెడికల్ కళాశాలలకు సుప్రీంకోర్టులో ఊరట


ప్రైవేటు మెడికల్ కళాశాలలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) అనుమతి రద్దు చేసిన కాలేజీల రెన్యువల్ కు కోర్టు అవకాశం ఇచ్చింది. దాంతో, కళాశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి మార్గం సుగమమైంది. నిబంధనల ప్రకారం కళాశాలల్లో పది రోజుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. సదుపాయాలు మెరుగుపరిచాక లిఖితపూర్వక హామీ ఇవ్వాలని ఆదేశించింది. అంతేగాక రూ.10 కోట్ల బ్యాంకు గ్యారెంటీ సమర్పించాలని కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సదుపాయాలు మెరుగుపరచకపోతే బ్యాంకు గ్యారెంటీని జప్తు చేస్తామని చెప్పింది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణలో 1000 మెడికల్ సీట్లు పెరగనున్నాయి.

  • Loading...

More Telugu News