: బీచ్ లో 'ఆగడు' కోసం అతిపెద్ద పోలీస్ బెల్ట్!


మహేష్ బాబు నటించిన 'ఆగడు' చిత్రం ఈ నెల 19న విడుదలవుతుండడంతో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా, ప్రత్యేకంగా తయారుచేయించిన అతిపెద్ద పోలీస్ బెల్టును విశాఖలోని ఆర్కే బీచ్ లో చిత్ర నిర్మాతలు ఆవిష్కరించారు. దానిని చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. దీని పొడవు సుమారు 12 వేల అడుగులు ఉంటుందని ఈ సందర్భంగా నిర్మాతలు తెలిపారు. పోలీసు డ్రెస్ లో బెల్ట్ అతి ముఖ్యమైందని, కాబట్టి ప్రపంచంలోనే అత్యంత పొడవైన పోలీస్ బెల్ట్ ను తయారు చేయించామని వివరించారు. ఈ 'ఆగడు' చిత్రంలో మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించాడు.

  • Loading...

More Telugu News