: టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య తేడా కేవలం 5 లక్షల ఓట్లే: జగన్


గత ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్సీపీకి మధ్య ఓట్ల తేడా కేవలం 5 లక్షలేనని వైఎస్సార్సీపీ అధినేత జగన్ తెలిపారు. అనంతపురం జిల్లా నేతలతో నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను చంద్రబాబు నాయుడిలా అబద్ధాలు చెప్పలేదని, మోసం చేయలేదని అన్నారు. ఎన్నికల్లో వారి విజయానికి మోడీ హవా, రైతు రుణమాఫీ హామీ ప్రధాన కారణం అని ఆయన తెలిపారు. ఇప్పుడా హామీల నుంచి బాబు తప్పుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. వైఎస్సార్సీపీకి ఉన్నది, చంద్రబాబుకు లేనిది విశ్వసనీయతేనని ఆయన పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేయడానికే తాను సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News