: భారత్ పై కన్నేసిన 'ఆలీబాబా'


చైనా ఇ-కామర్స్ దిగ్గజం 'ఆలీబాబా' భారత్ లో కాలుమోపేందుకు యత్నిస్తోంది. భారత్ కు చెందిన ప్రముఖ ఆన్ లైన్ రిటైలర్ 'స్నాప్ డీల్'తో ఈ మేరకు చర్చలు జరుపుతోంది. స్నాప్ డీల్ లో తాము పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలపై ఆలీబాబా ఈ చర్చలకు తెరదీసింది. గత శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్లో పబ్లిక్ ఇష్యూ జారీ చేసిన ఈ చైనా కంపెనీ ఇప్పుడు భారత్ పై కన్నేసింది. కాగా, స్నాప్ డీల్ తో 'ఆలీబాబా' చర్చల సారాంశం ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై స్నాప్ డీల్ వ్యాఖ్యానించబోదని ఆ కంపెనీ ప్రతినిధి తెలిపారు. అటు, 'ఆలీబాబా' కూడా మీడియాకు అందుబాటులోకి రాలేదు.

  • Loading...

More Telugu News