: ఆసియా క్రీడల్లో థాయ్ లాండ్ యువరాణి


ఆసియా క్రీడల్లో ఈక్వెస్ట్రియన్ విభాగంలో థాయ్ లాండ్ యువరాణి సిరివన్నవారి నారీరతనా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. థాయ్ లాండ్ రాజ వంశానికి చెందిన కింగ్ భుమిబోల్ కు ఈమె మనవరాలు. ఈ 27 ఏళ్ల యువరాణి క్రీడల్లో పాల్గొనడం ఇదే తొలిసారి కాదు. 2006లో జరిగిన దోహా క్రీడల బ్యాడ్మింటన్ లో పోటీ పడి సహ అథ్లెట్స్ తో కలిసి క్రీడా విలేజ్ లో బస చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. చిన్నప్పటి నుంచి గుర్రపు స్వారీలో ప్రావీణ్యమున్న ఈమె సొంత ప్రతిభతోనే జట్టులో చోటు సంపాదించుకుంది. స్వర్ణమే లక్ష్యంగా బరిలో దిగుతానని ఆమె స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News