: "100 రోజుల మిస్ రూల్" పేరుతో బీజేపీ పాలనపై కాంగ్రెస్ పుస్తకం
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వంద రోజుల పాలనపై కాంగ్రెస్ "మోడీ గవర్నమెంట్- ద ట్రూత్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్: 100 డేస్ మిస్ రూల్" పేరుతో ఓ పుస్తకం తీసుకొచ్చింది. లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో... ఓ పనికిరాని ప్రభుత్వం చేసిన డొల్ల వాగ్దానాలపై ప్రజలు తమ కోపాన్ని చూపారని అందులో పేర్కొంది. ఇప్పటివరకు జరిగిన పాలనలో కేవలం నినాదాలు మాత్రమే ఉన్నాయని, ఇంకా మిగతా పాలనలో ఈ ప్రభుత్వం ఎన్ని అబద్ధాలను దాచిందోనని పుస్తకం విడుదల సందర్భంగా ఏఐసీసీ అధికార ప్రతినిధి అనంద్ శర్మ అన్నారు.