: త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన జిన్ పింగ్
భారత పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రాష్ట్రపతి భవన్ లో త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ఆయనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సాదరంగా ఆహ్వానించారు. కాసేపట్లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ బాపూ ఘాట్ ను సందర్శించనున్నారు. అక్కడి నుంచి తాజ్ ప్యాలెస్ హోటల్ కు చేరుకుని, 11 గంటలకు హజ్ హౌస్ లో ప్రధానితో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12:30 నిమిషాలకు కీలక ఒప్పందాలపై వారిరువురూ సంతకాలు చేయనున్నారు. ఈ ఒప్పందాల ద్వారా చైనా నుంచి భారత్ కు పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అనంతరం ఆర్థిక, వాణిజ్య బంధాల బలోపేతమే ప్రధాన అజెండాగా రెండు దేశాల అత్యున్నత అధికార బృందాలు చర్చలు జరపనున్నాయి.