: కాకతీయ వర్సిటీలో ర్యాగింగ్ కలకలం
వరంగల్ లోని కాకతీయ వర్సిటీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపుతోంది. వర్సిటీ క్యాంపస్ లోని గణపతి దేవ హాస్టల్ లో బుధవారం రాత్రి పలువురు జూనియర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. ర్యాగింగ్ లో సీనియర్లు వికృతంగా ప్రవర్తించిన నేపథ్యంలో, జూనియర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ర్యాగింగ్ కు పాల్పడ్డ సీనియర్లను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.