: స్పీకర్ కోడెల కుమారుడిపై కిడ్నాప్ కేసు


ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కొడుకు శివరామకృష్ణపై విశాఖపట్టణంలోని త్రీటౌన్ స్టేషన్ లో కిడ్నాప్ కేసు నమోదైంది. విశాఖపట్నం త్రీటౌన్ పరిధిలో నివసిస్తున్న శివరామకృష్ణ... తన భార్య ఇంటిపై మరో నలుగురితో కలిసి దాడి చేశారు. ఇంటి తలుపులు పగలగొట్టి తన అత్తమామలను బెదిరించి, తన కుమారుడు గౌతమ్(4)ను తీసుకుపోయినట్టు అతని భార్య పద్మప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2009 ఆగస్టులో తనకు శివరామకృష్ణతో వివాహం జరిగిందని, అనంతరం తమ ఇద్దరి మధ్య మనస్పర్థలతో వివాదాలు చోటుచేసుకున్నాయని, అత్తింటి ఆరళ్లు తట్టుకోలేకపోతున్న తనను పలు మార్లు గెంటేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2010లో తమకు బాబు పుట్టిన తరువాత కూడా తనను ఇంటి నుంచి గెంటేశారని ఆమె తెలిపారు. కోడెల అధికారంలోకి వచ్చిన తరువాత ఈ వేధింపులు పెరిగాయని ఆమె ఫిర్యాదులో వెల్లడించారు. ఏడాది కాలంగా విశాఖలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్న తనపై దాడి చేసి కుమారుడ్ని కిడ్నాప్ చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News