: ఇంద్రకీలాద్రిపై రాళ్ల వర్షం


భారీ వర్షాల కారణంగా విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై నుంచి దుర్గమ్మ గుడికి వెళ్తున్న ఘాట్ రోడ్డు మార్గంలో బండ రాళ్లు పడుతున్నాయి. దీంతో దుర్గగుడి అధికారులు ద్విచక్రవాహనాలను నిషేధించారు. కేవలం దేవస్థానానికి చెందిన బస్సుల్లో మాత్రమే భక్తులను గుడికి తరలిస్తున్నారు. ఘాట్ రోడ్డులో పడిన రాళ్లను తొలగించేందుకు ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. విజయవాడలో వేకువజాము నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది.

  • Loading...

More Telugu News