: పాతబస్తీని కుదిపేసిన మైనర్ బాలిక కాంట్రాక్టు పెళ్లి
హైదరాబాదు పాతబస్తీలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికను ఓ కుటుంబం బడా షేక్ కు కాంట్రాక్టు పెళ్లి పేరిట విక్రయించింది. దీంతో షేక్ మైనర్ బాలికను గోవా తీసుకెళ్లి అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో వారం తరువాత బాలిక ఇల్లు చేరింది. దీంతో బాలికకు మరో వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. కుటుంబ సభ్యుల తీరుపై ఎదురు తిరిగిన బాలిక ఇంటినుంచి పారిపోయి పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ దారుణం వెలుగు చూసింది. దీనిపై పలు సంఘాలు ఆందోళన చేశాయి. పాతబస్తీలోని మైనర్ బాలికలు, యువతులపై ఇలాంటి దాష్టీకాలు నిత్యకృత్యమైపోయాయని, సొంత కుటుంబ సభ్యులే కన్నవారిని అమ్మేయడం, వారు కొంత కాలం అనుభవించి వదిలేయడం పరిపాటిగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.