: ఎన్జీ రంగా వర్సిటీలో ఉమ్మడి కౌన్సిలింగ్


ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిెలోని వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర విభజన జరిగినా, కొన్ని కారణాల వల్ల ఈ ఏడాది రెండు రాష్ట్రాల విద్యార్థులకు ఉమ్మడిగానే కౌన్సిలింగ్ నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని కొన్ని నిబంధనలను ఆధారం చేసుకుని కసరత్తు ముగించారు. తాజా నోటిఫికేషన్ ప్రకారం రెండు రాష్ట్రాల విద్యార్థులకు ఈ ఏడాది ఒకేసారి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. హైదరాబాద్ లోని రంగా వర్సిటీలోనే కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. గతేడాది ఎలాంటి నిబంధనలను పాటించారో, ఈ ఏడాది కూడా ఆ నిబంధనలనే పాటిస్తారు. అయితే తమ పరిధిలోని విద్యాలయాల వ్యవహారాలను తామే పర్యవేక్షించుకుంటామంటూ తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పిన నేపథ్యంలో రంగా నోటిఫికేషన్ మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేందుకు కారణమయ్యే అవకాశం లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News