: ఇక్కడ అధ్యక్షుడి పర్యటన... అక్కడ సైన్యం దురాక్రమణ
చైనా అధ్యక్షుడు భారత్ లో పర్యటిస్తుండగానే సరిహద్దుల్లో చైనా సైన్యం తన కుటిల బుద్ధి ప్రదర్శించింది. ఆ దేశాధ్యక్షుడు స్నేహ హస్తం చాస్తుండగా, అక్కడి సైన్యం కయ్యానికి కాలుదువ్వుతోంది. లడఖ్ సెక్టార్ లోని చుముర్ ప్రాంతంలో చైనా సైన్యం అతిక్రమణకు పాల్పడిందని సమాచారం. దీంతో వారిని నిలువరించడానికి ఐటీబీపీ సిబ్బంది, సైన్యం తరలి వెళ్లినట్టు తెలుస్తోంది.