: ఇండియా ఎంటర్ టైన్ మెంట్ రంగం విలువ 2272 బిలియన్లు
భారత్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఎంటర్ టైన్ మెంట్ మీడియా రంగం ఒకటి. ఇప్పటికే తార స్థాయికి చేరిన వినోదరంగం, 2018 నాటికి తన స్థాయిని మరింత విస్తృతం చేసుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజా పీడబ్ల్యూసీ-సీఐఐ నివేదిక ప్రకారం వినోద రంగం ప్రతి ఏటా 15 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటోంది. 2012 లో భారత టీవీ రంగం విలువ 366 బిలియన్లు ఉండగా, అది 2013 నాటికి 420 బిలియన్లకు చేరింది. టీవీ, మీడియా, వినోద రంగాలు కలిపి 2013లో 1,120 బిలియన్ల వ్యాపారం చేశాయి. దీంతో 2018 నాటికి వినోద రంగం విలువ 2,272 బిలియన్లకు చేరుతుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.