: ఉపఎన్నికల్లో ఓటమిపై పార్టీ కార్యకర్తలు బాధపడొద్దు: అమిత్ షా
ఉప ఎన్నికల్లో పార్టీకి తీవ్ర పరాభవం ఎదురవడంపై కార్యకర్తలు కలత చెందొద్దని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధైర్యం చెప్పారు. రానున్న నాలుగు రాష్ట్రాల (మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్) అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని, అక్కడి నుంచి 'కాంగ్రెస్ రహిత దేశం' అజెండాతో ముందుకెళదామని చెప్పారు. కొన్ని ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ప్రతిపక్షాలు చాలా ఆనందంలో మునిగి పోతాయని, అప్పుడు కొన్ని ప్రాంతాల్లో బీజేపీ ఓడినందుకు, తగిన శాస్తి జరిగిందని వారు భావిస్తారని పేర్కొన్నారు. కానీ, బీజేపీ అస్సాం, పశ్చిమ బెంగాల్లో ఖాతా తెరిచిందన్న విషయాన్ని గమనించరన్నారు.