: జమ్మూ కాశ్మీర్ వరద బాధితులకు 'బజాజ్ ఆటో' భారీ సాయం


జమ్మూకాశ్మీర్ వరద బాధితులకు ప్రముఖ వాహన తయారీ సంస్థ 'బజాజ్ ఆటో' భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. తమ వంతుగా ప్రధాని జాతీయ సహాయనిధికి రూ.20 కోట్లు విరాళంగా ఇవ్వనుంది. ఈ మేరకు బజాజ్ ఆటో ఛైర్మన్ రాహుల్ బజాజ్ మాట్లాడుతూ, వరదల కారణంగా సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మారిన జమ్మూకాశ్మీర్ వాసులను ఆదుకోవాలనే ఈ సాయం చేస్తున్నట్టు తెలిపారు. అంతేగాక, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టే పునరావాస కార్యక్రమాల్లోనూ భాగస్వాములం అవుతామని ఆయన హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News